మూడ్రోజులపాటు పింఛను పంపిణీ

ABN , First Publish Date - 2020-12-01T06:51:20+05:30 IST

వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను ఈనెలలో మూడ్రోజులపాటు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

మూడ్రోజులపాటు పింఛను పంపిణీ

చిత్తూరు అర్బన్‌, నవంబరు 30: వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను ఈనెలలో మూడ్రోజులపాటు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గత నెల వరకు ఒక్క రోజులోనే వందశాతం పింఛన్ల పంపిణీ చేయాలనుకున్నారు. బయోమెట్రిక్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సాధ్యం కాలేదు. దాంతో ఈనెల నుంచి మూడ్రోజులపాటు పంపిణీ చేయనున్నట్లు ఏపీవో రవికుమార్‌ సోమవారం తెలిపారు. వేలిముద్రలు, కన్ను బొమ్మలు పడని లబ్ధిదారులకు పీడీవో (పెన్షన్‌ డిస్‌బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌)ల ఆథరైజేషన్‌ ద్వారా పింఛను నగదు లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T06:51:20+05:30 IST