144మంది కోవిడ్‌ బాధితుల డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-07-19T11:56:19+05:30 IST

కరోనా నుంచి చికిత్సతో ఆరోగ్యవంతులుగా మారిన 144మందిని శనివారం వైద్యులు డిశ్చార్జి చేశారు.

144మంది కోవిడ్‌ బాధితుల డిశ్చార్జి

తిరుపతి (వైద్యం)/చిత్తూరు రూరల్‌, జూలై 18 : కరోనా నుంచి చికిత్సతో ఆరోగ్యవంతులుగా మారిన 144మందిని శనివారం వైద్యులు డిశ్చార్జి చేశారు. తిరుపతి రుయాస్పత్రి నుంచి 16మంది, ప్రసూతి ఆస్పత్రి నుంచి ఒకరు, శ్రీనివాసం కోవిడ్‌ సెంటర్‌ నుంచి 80మందిని డిశ్చార్జి చేశారు. 


స్విమ్స్‌ పద్మావతీ ఆస్పత్రి నుంచి 36 మంది బాధితులను డిశ్చార్జి చేశామని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 270 మంది  చికిత్స పొందుతున్నారన్న ఆయన శనివారం 2700 మంది అనుమానితుల నుంచి శ్వాబ్‌ సేకరించి, పరీక్షల నిమిత్తం స్విమ్స్‌ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు.చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నుంచి 11మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2020-07-19T11:56:19+05:30 IST