మరో 71 కరోనా కేసుల నిర్ధారణ
ABN , First Publish Date - 2020-07-10T10:37:46+05:30 IST
జిల్లాలో కొత్తగా 71 పాజిటివ్ కేసులను నిర్ధారించారు. వీటిలో తిరుపతి నగరంలో 30, పుత్తూరులో 13, చిత్తూరులో 7,..

తిరుపతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 71 పాజిటివ్ కేసులను నిర్ధారించారు. వీటిలో తిరుపతి నగరంలో 30, పుత్తూరులో 13, చిత్తూరులో 7, నగరిలో 6, శ్రీకాళహస్తి 2, చిన్నగొట్టిగల్లు, కేవీపల్లె, కేవీబీపురం, మదనపల్లె, పాకాల, పలమనేరు, పెనుమూరు, వడమాలపేట, ఎర్రావారిపాలెం మండలాల్లో ఒక్కొక్కటి వున్నాయి. ఇవి కాకుండా జిల్లాలో వున్న ఇతర జిల్లాలకు చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది. తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2646కు చేరుకోగా అందులో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందినవి మినహాయిస్తే ఈ జిల్లాకు చెందిన కేసులు 2557 వున్నాయి. కాగా ఈ నెల 7, 8 తేదీల్లో రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. 7వ తేదీన 261 మంది పాజిటివ్ వ్యక్తుల్ని గుర్తించగా 8న 227 మందిని గుర్తించారు. గురువారం సాయంత్రం వరకూ నమోదైన కేసుల వివరాలు చూస్తే తిరుపతి నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య 659కి చేరుకోగా పుత్తూరులో 229కి, శ్రీకాళహస్తిలో 206కు, చిత్తూరులో 192కు చేరాయి.
తిరుపతి రూరల్‌లో 147, నగరిలో 159, సత్యవేడులో 102, రేణిగుంటలో 66, మదనపల్లెలో 59, నారాయణవనంలో 58, నిండ్రలో 55, చంద్రగిరిలో 50, నాగలాపురంలో 45, పిచ్చాటూరులో 44, విజయపురంలో 39, ఏర్పేడులో 29, కేవీబీపురంలో 25, వి.కోటలో 23, వరదయ్యపాలెంలో 22, గుడిపాల, కార్వేటినగరాల్లో 21 చొప్పున, పుంగనూరులో 19, జీడీనెల్లూరు, పీలేరుల్లో 14 చొప్పున, రామసముద్రంలో 13, వడమాలపేటలో 12, కుప్పం, గుర్రంకొండ, తవణంపల్లెల్లో 11 చొప్పున, రామకుప్పం, వెదురుకుప్పం,ములకలచెరువుల్లో 10 చొప్పున పెరిగాయి. అలాగే ఇతర జిల్లాలకు చెందినవి 73, ఇతర రాష్ట్రాలకు చెందినవి 10 చొప్పున కేసులు వున్నాయి.కాగా కరోనా వైరస్ బారిన పడి నగరికి చెందిన 84 ఏళ్ళ వృద్ధుడు గురువారం మృతి చెందారు. ఈ మరణంతో ఇప్పటి దాకా జిల్లాలో కోవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరుకుంది.