వ్యర్థాలపై పోరాటం
ABN , First Publish Date - 2020-12-08T05:10:38+05:30 IST
వ్యర్థాలపై పోరాటం కార్యక్రమాన్ని జేసీ వీరబ్రహ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ప్రారంభించారు.

చిత్తూరు, డిసెంబరు 7: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని జేసీ వీరబ్రహ్మం పేర్కొన్నారు. సోమవారం మనం- మన పరిశుభ్రత రెండో విడత కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలపై పోరాటం కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వ్యర్థాలపై పోరాటంలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. 496 పంచాయతీల్లో వ్యర్థాలపై పోరాటం కార్యక్రమాన్ని పక్షం రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పర్యవేక్షణకు మండల స్థాయి కమిటీలు వేశామన్నారు. జేసీ రాజశేఖర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులంతా సమష్టిగా పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వ్యర్థాలపై పోరాటం బ్రోచర్‌ను విడుదల చేశారు. జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, డీఎల్‌డీవోలు ఆదిశేషారెడ్డి, రాధమ్మ, జ్యోతి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.