హమాలీలకు దీపావళి కానుక
ABN , First Publish Date - 2020-11-13T06:09:43+05:30 IST
పౌరసరఫరాల సంస్థకు చెందిన 28 మండల్ లెవల్ స్టాకు పాయింట్లలో పనిచేస్తున్న 254మంది హమాలీలకు జేసీ మార్కొండేయులు గురువారం దీపావళి కానుకలను అందించారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 12: పౌరసరఫరాల సంస్థకు చెందిన 28 మండల్ లెవల్ స్టాకు పాయింట్లలో పనిచేస్తున్న 254మంది హమాలీలకు జేసీ మార్కొండేయులు గురువారం దీపావళి కానుకలను అందించారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి హమాలీకి మూడు జతల ఖాకీ దుస్తులు, రూ.500 నగదు, తీపి పదార్థాల కొనుగోలు కోసం రూ.1000 వంతున పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎం ఎన్. సోమయాజులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.