పోటెత్తిన కాణిపాక ఆలయం

ABN , First Publish Date - 2020-12-26T06:11:14+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

పోటెత్తిన కాణిపాక ఆలయం
ఆలయ అణివేటి మండపంలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకున్నారు.ఆలయ క్యూలైన్లతో పాటు అణివేటి మండపం భక్తులతో నిండి పోయింది. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రూ. 100 టికెట్టు 1800 మంది, రూ.51 టికెట్టు 2000 మంది, రూ.10 టికెట్టు 5000 మంది, నిజరూపం 900, ఉచిత దర్శనం 5000 మంది భక్తులతో పాటు పరిసర గ్రామస్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా ఈవో వెంకటేశు దగ్గరుండి పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ తర్వాత ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఇదే ప్రథమం.


Updated Date - 2020-12-26T06:11:14+05:30 IST