-
-
Home » Andhra Pradesh » Chittoor » cpi is chandrababu party
-
సీపీఐ... చంద్రబాబు పార్టీ: రోజా
ABN , First Publish Date - 2020-12-28T05:30:00+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వంతపాడుతున్న నారాయణ సీపీఐని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

పుత్తూరు, డిసెంబరు 28: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వంతపాడుతున్న నారాయణ సీపీఐని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సోమవారం నగరి మండలం వీకేఆర్‌పురంలో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇళ్లు కుక్కలను కట్టేసుకునేందుకు కూడా సరిపోవని నారాయణ చేసిన విమర్శ కమ్యూనిస్టులకు తలవంపులు తెస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు తన స్వస్థలానికి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు బాత్‌రూంల నిర్మాణానికి కూడా సరిపోవని నారా లోకేశ్ ఎగతాళి చేయడం పేదలను చిన్నచూపు చూడడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ శంకరప్ప, ఎంపీడీవో రామచంద్ర, తహసీల్దార్ బాబు, వైసీపీ నాయకులు బుజ్జిరెడ్డి, తిరుమలరెడ్డి, సుదర్శన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.