కరోనా బాధితులకు కార్పొరేట్‌ వైద్యమందిద్దాం: చెవిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-20T17:09:00+05:30 IST

‘కరోనా బాధితులకు కార్పొరేట్‌ వైద్యమందిద్దాం. దీనికి ఏమి కావాలి. అలాగే..

కరోనా బాధితులకు కార్పొరేట్‌ వైద్యమందిద్దాం: చెవిరెడ్డి

తిరుపతి(ఆంధ్రజ్యోతి): ‘కరోనా బాధితులకు కార్పొరేట్‌ వైద్యమందిద్దాం. దీనికి ఏమి  కావాలి. అలాగే అపోలో ఆస్పత్రిలో అమలు చేస్తున్న కొవిడ్‌ ప్రొటోకాల్‌ ఏమిటో.. చెప్పండి. అందరినీ సమన్వయపరిచి ఆదిశగా చర్యలు చేపడతాం’ అంటూ తుడా చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో కొవిడ్‌ సమన్వయ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. కొవిడ్‌ బాధితులకు నమ్మకంతోపాటు ప్రజలకు భరోసా కలిగించాలని చెప్పారు. కొవిడ్‌ చికిత్సకోసం ఏమికావాలో వాటిని ఇక్కడే మనం సమకూర్చుకోవచ్చని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పద్మావతి నిలయంలో అందుతున్న సేవల విషయంలో గర్వంగా ఉందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్‌, ఐసొలేషన్‌లో ఉండేవారికి మంచి పుస్తకాలు అందజేయాలన్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలను సోమవారం మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ వీరబ్రహ్మం, తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-20T17:09:00+05:30 IST