స్పానిష్, అరబిక్ భాషలపై జ్ఞానాంబికలో కోర్సులు
ABN , First Publish Date - 2020-12-14T05:07:30+05:30 IST
డిగ్రీ కోర్సుల్లో స్పానిష్, అరబిక్ భాషల్లో విద్యాబోధన అందించడానికి మదనపల్లె జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఒప్పందం కుదుర్చుకుందని ఆ కళాశాల కరస్పాండెంట్ ఆర్.గురుప్రసాద్ పేర్కొన్నారు.

మదనపల్లె టౌన్, డిసెంబరు 13: డిగ్రీ కోర్సుల్లో స్పానిష్, అరబిక్ భాషల్లో విద్యాబోధన అందించడానికి మదనపల్లె జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఒప్పందం కుదుర్చుకుందని ఆ కళాశాల కరస్పాండెంట్ ఆర్.గురుప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేరళకు చెందిన ప్రముఖ మాదిన్ ఎడ్యుకేషనల్ అకాడమీ అరబిక్, స్పానిష్ భాషల్లో విద్యాబోధన అందించడానికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తమ కళాశాలలో కూడా స్పానిష్, అరబిక్ భాషలపై విద్యాబోధన అందించడానికి మాదిన్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. కేరళ రాష్ట్రం మలప్పరంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్ ఇబ్రహీం ఖలీల్ అల్ బుకారితో ఒప్పందపత్రాలు మార్చుకున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తమ కళాశాలలో ప్రవేశపెట్టనున్న స్పానిష్, అరబిక్ భాషల విద్యబోధన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గురుప్రసాద్ కోరారు.