మరో 1055 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-20T09:44:41+05:30 IST

జిల్లాలో మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం రాత్రి 9 గంటల వరకూ 1055 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ.. 12 గంటల్లో 559

మరో 1055 మందికి కరోనా

27430కి చేరిన కేసుల సంఖ్య

 కొవిడ్‌తో వి.కోటలో నవ వరుడు... టీటీడీలో ఏఈ మృతి


తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం రాత్రి 9 గంటల వరకూ 1055 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ.. 12 గంటల్లో 559 మంది ఉన్నారు. ఈ 559 మందిలో తిరుపతి నగరంలోనే 228, తిరుపతి రూరల్‌ మండలంలో 68, చిత్తూరులో 53, రేణిగుంటలో 23, రామచంద్రాపురంలో 16, శ్రీకాళహస్తిలో 11, చంద్రగిరి, పీలేరు, పాకాల మండలాల్లో 7 చొప్పున, మదనపల్లె, కలికిరి, నగరి మండలాల్లో 5 చొప్పున, పెనుమూరు, నారాయణవనం, తవణంపల్లె మండలాల్లో 4 చొప్పున, పుత్తూరు, ఏర్పేడు, వడమాలపేట, పూతలపట్టు మండలాల్లో 3 చొప్పున, కేవీపల్లె, యాదమరి మండలాల్లో 2 చొప్పున, వాల్మీకిపురం, ఐరాల, బి.కొత్తకోట, గుర్రంకొండ, గుడుపల్లె, ఎర్రావారిపాలెం, కేవీబీపురం, కుప్పం, కలకడ, నిమ్మనపల్లె, జీడీనెల్లూరు, బీఎన్‌ కండ్రిగ, నిండ్ర, శాంతిపురం, సదుం, సోమల, శ్రీరంగరాజపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించగా, ఇతర జిల్లాలకు సంబంధించి 79 మంది ఉన్నారు.


తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి దాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27430కి చేరుకుంది. కాగా, వి.కోట మండలం నెర్నపల్లెకి చెందిన 30 ఏళ్ల యువకుడు కొవిడ్‌తో మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఇతడికి పది రోజుల కిందటే వివాహమైంది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇతడు బెంగళూరులో మృతి చెందాడు. అనంతరం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. 


టీటీడీలో 8కి చేరిన కొవిడ్‌ మరణాలు

టీటీడీలోని ఏఈఈ ఒకరు కరోనాతో బుధవారం పద్మావతీ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో దేవస్థానంలో కొవిడ్‌ మరణాలు ఎనిమిదికి చేరాయి. ఈ నెల 9వ తేదీ నాటికే దేవస్థానంలో 748 మంది ఉద్యోగులు, అర్చకులు కరోనా బారిన పడ్డారు.


అప్పటికే వైరస్‌ కారణంగా నలుగురు ఉద్యోగులు, ఒక అర్చకుడి సహా మొత్తం ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత మూడు రోజుల కిందట టీటీడీ భద్రతా విభాగం కమ్యూనికేషన్స్‌ అధికారి, మంగళవారం టీటీడీ ప్రచురణల విభాగంలో కింది స్థాయి ఉద్యోగి, బుధవారం ఏఈ చనిపోవడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. 


Read more