మరో 735 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-08-22T11:43:50+05:30 IST
జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు.. 24 గంటల్లో 735 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. వీరిలో శుక్రవారం ఉదయం
తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు.. 24 గంటల్లో 735 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. వీరిలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల్లో 179 మందిని గుర్తించారు. ఈ కేసుల్లో తిరుపతిలో 44, శ్రీకాళహస్తిలో 21, పీలేరులో 15, మదనపల్లెలో 13, కలికిరి, తిరుపతి రూరల్ మండలాల్లో 9 చొప్పున, చిత్తూరులో 8, పుత్తూరులో 7, పాకాల, పుంగనూరు మండలా ల్లో 5 చొప్పున, ఐరాల, రామచంద్రాపురం, వడమాలపేట మండలాల్లో 4 చొప్పున, బంగారు పాలెం, చిన్నగొట్టిగల్లు, పులిచెర్ల, సోమల మండలాల్లో 3 చొప్పున, నగరి, కార్వేటినగరం, పూతలపట్టు మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, కేవీపల్లె, నాగలాపురం, పీటీఎం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, రేణిగుంట, శ్రీరంగరాజపురం, తంబళ్లపల్లె, తవణంపల్లె, వరదయ్యపాలెం, వి.కోట, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 వేలకు చేరువైంది.