కొత్తగా 142 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-25T06:34:55+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రజలతో దోబూచులాడుతోంది. వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ స్వల్పంగా అయినా పెరుగుతున్నాయి.

కొత్తగా 142 మందికి కరోనా

86 వేలకు చేరువైన పాజిటివ్‌ కేసులు


తిరుపతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ప్రజలతో దోబూచులాడుతోంది. వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ స్వల్పంగా అయినా పెరుగుతున్నాయి. ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కేవలం 32 కేసులు మాత్రమే నమోదు కాగా తదుపరి 24 గంటల్లో అంటే సోమవారం ఉదయం 9 గంటల నుంచీ మంగళవారం ఉదయం 9 గంటల నడుమ నాలుగు రెట్లకు మించి 142 కేసులు నమోదయ్యాయి. అలాగే ఆది, సోమవారాల నడుమ ఒక్క మరణం కూడా సంభవించకపోగా సోమ, మంగళవారాల నడుమ కొవిడ్‌ బారిన పడి ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కేసులు 85944కు చేరుకుని 86 వేలకు చేరువయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య 823కు చేరింది. కొత్తగా గుర్తించిన కేసుల్లో తిరుపతి నగరంలో 51, చిత్తూరులో 15, మదనపల్లెలో 11, కలికిరి, కుప్పం, తిరుపతి రూరల్‌ మండలాల్లో 6 చొప్పున, శ్రీకాళహస్తిలో 5, పాకాలలో 4, పుంగనూరు, పుత్తూరు, చౌడేపల్లె, ఐరాల, కురబలకోట మండలాల్లో 3 వంతున, రేణిగుంట, సదుం, యాదమరి మండలాల్లో 2 చొప్పున, బంగారుపాళ్యం, బీఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, గంగవరం, గుడిపాల, గుడుపల్లె, కలకడ, కార్వేటినగరం, పలమనేరు, పెద్దమండ్యం, పెద్దపంజాణి, రామసముద్రం, రొంపిచెర్ల, సోమల, తవణంపల్లె, వరదయ్యపాళ్యం, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Read more