చిత్తూరు జిల్లాలో మరో 537 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-03T18:21:35+05:30 IST

జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 537 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.తిరుపతి నగరంలో 115, మదనపల్లెలో 58, చిత్తూరులో 45, తిరుపతి రూరల్‌లో

చిత్తూరు జిల్లాలో మరో 537 కరోనా కేసులు

తిరుపతి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 537 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.తిరుపతి నగరంలో 115, మదనపల్లెలో 58, చిత్తూరులో 45, తిరుపతి రూరల్‌లో 33, శ్రీకాళహస్తిలో 19, రేణిగుంటలో 17, పెద్దపంజాణిలో 16, యాదమరిలో 14, పుత్తూరు, పూతలపట్టు మండలాల్లో 13 వంతున, సదుంలో 11, బంగారుపాళ్యం, కేవీపల్లె, చంద్రగిరి, వాల్మీకిపురం, పాకాల మండలాల్లో 10 చొప్పున, పెనుమూరు, పుంగనూరు, సోమల మండలాల్లో 9 వంతున, తవణంపల్లె, ఐరాల, గుడిపాల మండలాల్లో 8 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి  తాజాకేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి దాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 66333కు చేరుకుంది.వైరస్‌తో పోరాడుతూ మరో ముగ్గురు చనిపోయారు.


కొవిడ్‌ సెంటర్లలో 2920 పడకల ఖాళీ 

తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు,కేర్‌ సెంటర్లలో శుక్రవారం రాత్రి 10  గంటలకు 2,920 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,760 సాధారణ, 160 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 131, స్విమ్స్‌ 190, ఈఎస్‌ఐలో 33, విష్ణునివాసంలో 493, మాధవంలో 369. పద్మావతి నిలయంలో 130, గోవిందరాజసత్రంలో 823, శ్రీనివాసంలో 575, టీటీడీ ఉద్యోగులకు 16 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో 83, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 32, ఐసీయూలో బెడ్స్‌ రుయాలో 4, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి. కాగా  తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అడ్మిషన్లను శుక్రవారం నిలిపివేశారు. 853మందిని అడ్మిట్‌ చేసుకునేలా గోవిందరాజసత్రాల్లో ఏర్పాట్లు చేయగా ఇప్పుడు అక్కడ 30 మంది కొవిడ్‌ బాధితులున్నారు. వారికి చికిత్స పూర్తయిన తరువాత ఆ కేంద్రాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-10-03T18:21:35+05:30 IST