12 ప్రాంతాల్లో ‘సహకార’ బ్యాంకు బ్రాంచిలు

ABN , First Publish Date - 2020-06-26T11:16:39+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపార లావాదేవీల విస్తరణలో భాగంగా కొత్తగా 12 ప్రాంతాల్లో బ్రాంచిల ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో మనోహర్‌గౌడ్‌ తెలిపారు.

12 ప్రాంతాల్లో ‘సహకార’ బ్యాంకు బ్రాంచిలు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపార లావాదేవీల విస్తరణలో భాగంగా కొత్తగా 12 ప్రాంతాల్లో బ్రాంచిల ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో మనోహర్‌గౌడ్‌ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సదుం, బైరెడ్డిపల్లెలో బ్రాంచిల ఏర్పాటుకు ఆప్కాబ్‌ నుంచి అనుమతి లభించిన దృష్ట్యా చర్యలు చేపట్టామన్నారు. ఇక పెనుమూరు, కొత్తపల్లె మిట్ట, వడమాలపేట, కలకడ, రామకుప్పం, మల్లనూరు, కలికిరి, పెద్దమండ్యం, గుర్రంకొండ, కేవీపల్లెల్లోనూ అనుమతులు రాగానే శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

Updated Date - 2020-06-26T11:16:39+05:30 IST