-
-
Home » Andhra Pradesh » Chittoor » Coolies are tears
-
కూలీలు.. కన్నీళ్లు..!
ABN , First Publish Date - 2020-05-13T10:38:43+05:30 IST
సొంత రాష్ట్రం బీహార్‌కు వెళ్లడానికి అనుమతుల రాక ఇబ్బందులు పడుతున్నామని, తమ కష్టాలు తీర్చే

సొంత రాష్ట్రాలకు వెళ్లలేక ఇక్కట్లు
ఇప్పటికీ రాని అనుమతులు
తమ కష్టాలు తీర్చేనాథుడే లేడని వేడుకోలు
మదనపల్లె అర్బన్, మే 12: సొంత రాష్ట్రం బీహార్‌కు వెళ్లడానికి అనుమతుల రాక ఇబ్బందులు పడుతున్నామని, తమ కష్టాలు తీర్చే నాథుడే లేడా అని బీహార్‌కు చెందిన వలస కూలీలు అచయ్‌కుమార్, రాజేష్‌కుమార్, సుభాష్ వాపోయారు. బీహార్‌లోని ముగేర్, బాగల్‌పూర్, ఖాగ డియా జిల్లాలకు చెందిన సుమారు వందమంది వలస కూలీలు తమ లగేజీలతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి కోసం ఈ నెల 1, 2 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకున్నామని తెలిపారు.
కానీ ఇప్పటివరకు రాలేదని, కష్టాలు పడుతున్నామని, అర్థాకలితో గడుపుతున్నామని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమకు అవకాశం ఎప్పుడు వస్తుందోనని వేయికళ్లతో.. ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా ప్రభుత్వ అనుమతి రాగానే పంపిస్తామని స్పష్టం చేశారు.