జిల్లాలో మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-12-05T06:12:37+05:30 IST

చిత్తూరు జిల్లాను వీడని వర్షాలు

జిల్లాలో మోస్తరు వర్షాలు

చిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 4: బురేవి తుఫాను ప్రభావంతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసాయి. తూర్పు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడగా, పశ్చిమ మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా బీఎన్‌కండ్రిగలో 64.2 మి.మీ., అత్యల్పంగా గుడుపల్లెలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా... నాగలాపురంలో 55.4, సత్యవేడులో 54.6, పిచ్చాటూరులో 54.4, వడమాలపేటలో 52.8, నిండ్రలో 47.4, తొట్టంబేడులో 43.6, శ్రీకాళహస్తిలో 39.4, ఆర్‌సీపురంలో 38.8, కేవీబీపురంలో 38.6, రేణిగుంటలో 36.2, పలమనేరులో 35.4, నగరిలో 33.8, చంద్రగిరిలో 32.8, వరదయ్యపాళెంలో 32.6, పాలసముద్రంలో 32.4, తిరుపతి అర్బన్‌లో 31.8, పాకాలలో 30.2, కేవీపల్లెలో 29.4, ఏర్పేడులో 28.8, నారాయణవనంలో 28.4, తిరుపతి రూరల్‌లో 28.4, పెనుమూరులో 27.8, ఎస్‌ఆర్‌పురంలో 25.8, వెదురుకుప్పంలో 24.6, గుడిపాల, పూతలపట్టు, పుత్తూరులలో 24.2, తవణంపల్లెలో 23.2, కార్వేటినగరంలో 22.4, ఐరాలలో 21.4, విజయపురంలో 20.8, జీడీనెల్లూరులో 20.2, చిన్నగొట్టిగల్లులో 20.2, చిత్తూరులో 19.8, బంగారుపాళ్యంలో 18.6, పులిచెర్లలో 18.6, కలికిరి, గంగవరంలో 18.4, ఎర్రావారిపాళెంలో 17.4, కలకడ, నిమ్మనపల్లెలో 16.6, సదుంలో 15.2, యాదమరిలో 15, సోమలలో 14.6, పెద్దపంజాణి, పెద్దమండ్యంలో 14.2, వాల్మీకిపురంలో 14, రొంపిచెర్లలో 13.6, కురబలకోటలో 11.2, గుర్రకొండ, పీలేరులో 10.4 మి.మీ., 14 మండలాల్లో 10 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-12-05T06:12:37+05:30 IST