-
-
Home » Andhra Pradesh » Chittoor » conistable died from current shock
-
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2020-12-27T05:58:36+05:30 IST
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం గుర్రంకొండలో జరిగింది.

గుర్రంకొండ, డిసెంబరు 26: విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం గుర్రంకొండలో జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్.ఇబ్రహీం గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈయన పట్టణంలోని పెద్దపాళ్యెం వీధిలో నివాసముంటున్నారు. ఇటీవల ఇందిరమ్మకాలనీలో నూతనంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. శనివారం సాయంత్రం ఇంటి పైకప్పు పనులు జరుగుతుండగా వాటిని పరిశీలించేందుకు ఇబ్రహీం వచ్చారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆయన పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడి నుంచి కిందపడ్డారు. కుటుంబీకులు వెంటనే వాల్మీకిపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీంకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇబ్రహీం చనిపోవడంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు.