-
-
Home » Andhra Pradesh » Chittoor » congratulations to conistable arshad from ttd chairman
-
కానిస్టేబుల్ అర్షద్‌కు టీటీడీ చైర్మన్ అభినందనలు
ABN , First Publish Date - 2020-12-28T05:05:50+05:30 IST
అన్నమయ్య మార్గంలో తిరుమలకు ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న కడప జిల్లా నందలూరుకు వృద్ధురాలు నాగేశ్వరమ్మ (60) కొంతదూరం వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని భద్రతా డ్యూటీలోని కడప స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ అర్షద్ గమనించారు. వెంటనే ఆమెను ఆరు కిలోమీటర్లు భుజంపై మోసుకొంటూ తిరుమలకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం అర్షద్‌కు ఫోన్‌చేసి అభినందించారు.

తిరుమల కాలినడక మార్గాల్లో
వైద్యశాలల ఏర్పాటుకు ఆదేశం
తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య మార్గంలో తిరుమలకు ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న కడప జిల్లా నందలూరుకు వృద్ధురాలు నాగేశ్వరమ్మ (60) కొంతదూరం వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని భద్రతా డ్యూటీలోని కడప స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ అర్షద్ గమనించారు. వెంటనే ఆమెను ఆరు కిలోమీటర్లు భుజంపై మోసుకొంటూ తిరుమలకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం అర్షద్‌కు ఫోన్‌చేసి అభినందించారు. ఆరు కిలోమీటర్లు మోసుకు రావడానికి వేంకటేశ్వరస్వామే తనకు శక్తినిచ్చారని ముస్లిం అయిన అర్షద్ చెప్పటం శ్రీవారు అందరికీ దైవమనే విషయం స్పష్టం చేసిందని చైర్మన్ పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. అర్షద్ సేవలను గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఇక నడకదారిలో ఇటీవల జెన్కో ఎండీ శ్రీధర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. దాంతో ఐదువందల మెట్లు ఎక్కి వెళ్లి.. స్ర్టెచర్‌పై ఆయన్ను కిందకు తీసుకొచ్చి స్విమ్స్‌లో చేర్చిన వైద్య సిబ్బందిని కూడా అభినందించారు. ఈ నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో అత్యవసర, మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేసి, రెండు షిఫ్టులలో సిబ్బందిని నియమించాలని టీటీడీ వైద్యాధికారులను ఆదేశించినట్టు తెలిపారు.