మామిడి రైతులకు నష్టం రానివ్వం
ABN , First Publish Date - 2020-06-11T10:04:25+05:30 IST
మామిడి రైతులకు నష్టం రాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ భరత్‌గుప్తా అన్నారు.

కలెక్టర్ భరత్‌గుప్తా హామీ
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 10: మామిడి రైతులకు నష్టం రాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ భరత్‌గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఆయన మామిడి రైతుసంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ... దీర్ఘకాలంలో మామిడికి అధిక ధరలు రావాలంటే పల్ప్ ఫ్యాక్టరీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఒకే రకమైన పంటల సాగుతో ధరలు పతనమవుతాయని గుర్తుచేశారు. టమోట, మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని రైతుసంఘ ప్రతినిధులు కోరగా, ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ చెప్పారు. అనంతరం రైతు సంఘ ప్రతినిధులు జయచంద్ర చౌదరి, కొత్తూరు బాబు, మాగాంటి గోపాలరెడ్డి తదితరులు భరత్‌గుప్తాకు మామిడి పండ్ల బుట్టను అందజేశారు. ఉద్యాన శాఖ ఏడీలు శ్రీనివాసులు, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.