-
-
Home » Andhra Pradesh » Chittoor » Collector Bharatgupta
-
కరోనాను దాటి.. కష్టాలు చెప్పుకోవడానికి
ABN , First Publish Date - 2020-06-23T10:30:50+05:30 IST
ఒకవైపు కరోనా వైరస్ విరుచుకుపడుతూనే ఉంది. వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్వయంగా..

స్పందన రద్దయినా కలెక్టరేట్‌కి వచ్చిన జనం
చిత్తూరు, జూన్ 22: ఒకవైపు కరోనా వైరస్ విరుచుకుపడుతూనే ఉంది. వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్వయంగా కలెక్టర్ భరత్‌గుప్తా ప్రకటించినప్పటికీ సోమవారం బాధిత జనం కలెక్టరేట్‌కు వచ్చారు. ఎంతకీ తీరని సమస్యలు వారిని కరోనా భయాన్ని దాటి కలెక్టరేట్‌కి నడిపించాయి. తెచ్చిన అర్జీలను బాక్సులో వేసి వెనుతిరిగారు. కొందరేమో తమ సమస్యలను మీడియా ఎదుట మొరపెట్టుకున్నారు. ఫ సాధారణ రకం ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం విఫలమైందని శాంతియుత ఉద్యమనేత ఈదల వెంకటాచలం నాయుడు విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ముందు సాధారణ రకం (బడ్డ) వడ్లు కిందపోసి నిరసన తెలిపారు.
ఇప్పటికైనా సాధారణ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అర్హులందరికీ వర్తించేలా చూడాలని చిన్నగొట్టిగల్లు మండలంలోని చిన్నగొట్టిగల్లు, తొగటపల్లె, రంగన్నగారిగడ్డకు చెందిన చేనేత కార్మికులు మొరపెట్టుకున్నారు. ఫ చిత్తూరు 49వ డివిజన్‌లోని కోడిగుంటపల్లె దళితులు శ్మశానానికి వెళ్లడానికి తగిన దారి వసతి కల్పించాలని దళిత ప్రజా వేదిక, ఇతర దళిత సంఘాల నేతలు ధనంజయరావు, రాజ్‌కుమార్, అర్జునన్, వాసు తదితరులు డిమాండ్ చేశారు. ఫ మాయమాటలు చెప్పి తన భార్య, పిల్లలను ఓ వ్యక్తి తీసుకెళ్లాడని.. విచారించి న్యాయం చేయాలని ప్రైవేటు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు విజ్ఞప్తి చేశారు.