అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్దే శ్వాబ్‌ టెస్టులు

ABN , First Publish Date - 2020-06-04T10:40:55+05:30 IST

ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్దే శ్వాబ్‌ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదేశించారు.

అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్దే శ్వాబ్‌ టెస్టులు

 కలెక్టర్‌ భరత్‌గుప్తా


చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 3: ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్దే శ్వాబ్‌ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదేశించారు. బుధవారం ఆయన తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మట్లాడుతూ మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.జేసీలు వీరబ్రహ్మయ్య, చంద్రమౌళి, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ పాల్గొన్నారు. కాగా విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు పాల్గొన్న జేసీ-2 చంద్రమౌళి, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి రఘుపతి,ప్రసాద్‌ మాట్లాడుతూ... జిల్లాలో చిక్కుకున్న 152 మంది వలస కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేసినట్లు గుర్తుచేశారు.


Updated Date - 2020-06-04T10:40:55+05:30 IST