నేడు ‘స్పందన’ రద్దు

ABN , First Publish Date - 2020-03-23T10:13:09+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు.

నేడు ‘స్పందన’ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు, మార్చి 22: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. అత్యవసర వినతులుంటే కలెక్టరేట్‌ ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో వేసి వెళ్లాలని సూచించారు. అలాగే పోలీసు స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యయప్రయాసలు కోర్చి ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దన్నారు. 

Updated Date - 2020-03-23T10:13:09+05:30 IST