అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-11T11:17:48+05:30 IST
క్షేత్రస్థాయిలో కొవిడ్-19 లక్షణాలున్న వారిని గుర్తించడంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భరత్‌గుప్తా ..

చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 10: క్షేత్రస్థాయిలో కొవిడ్-19 లక్షణాలున్న వారిని గుర్తించడంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భరత్‌గుప్తా సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జ్వరం, ఆయాసం, దగ్గు ఉన్నవారిని వలంటీర్ల సహకారంతో క్షేత్ర స్థాయిలో గుర్తించాలన్నారు. కరోనా కారణంగా ఎవరైనా మృతి చెందితే మానవతా దృక్పథంతో స్పందించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.