-
-
Home » Andhra Pradesh » Chittoor » Collapse of banking hours
-
బ్యాంకుల పని వేళల కుదింపు
ABN , First Publish Date - 2020-03-24T10:55:37+05:30 IST
కరోనా వైరస్ విజృంభించనున్నదనే అనుమానాల నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది రోజువారీ పని వేళలను సగానికి సగం కుదించారు.

ఇక రోజులో నాలుగు గంటలు మాత్రమే
కలికిరి, మార్చి 23: కరోనా వైరస్ విజృంభించనున్నదనే అనుమానాల నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది రోజువారీ పని వేళలను సగానికి సగం కుదించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమన్వయ సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయం మేరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే బ్యాంకుల్లో లావాదేవీలుంటాయని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజరు విజయ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం నుంచి ఈ కొత్త పనివేళలు అమల్లోకి వచ్చాయని ఈ నెల 31వ తేదీ వరకూ ఈ నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు.కోటక్ మహేంద్ర బ్యాంకు మాత్రం తన పనివేళలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిర్ణయించింది. ఆంధ్రా బ్యాంకు కూడా ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం మేరకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుందని మేనేజరు నాగరాజ చెప్పారు.