ముక్కంటి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN , First Publish Date - 2020-12-28T05:27:55+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు.

ముక్కంటి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
గురుదక్షిణామూర్తి సన్నిధిలో జస్టిస్‌ జేకే మహేశ్వరి

శ్రీకాళహస్తి, డిసెంబరు 27: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు దక్షిణ గోపురం వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి రవీంద్రబాబు, మూడో ఏడీజే వీర్రాజు, శ్రీకాళహస్తి న్యాయమూర్తులు కోటేశ్వరబాబు, రాఘవేంద్ర, ఆలయ ఈవో పెద్దిరాజు, ఏఈవో ధనపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:27:55+05:30 IST