కర్ణాటక మద్యం భారీగా స్వాధీనం: ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-24T11:56:39+05:30 IST

కర్ణాటకకు చెందిన మద్యం చిత్తూరులో భారీగా పట్టుబడింది. శుక్రవారం స్థానిక అర్బన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో సీఐ పురుషోత్తం మీడియాకు వివరాలు తెలిపారు.

కర్ణాటక మద్యం భారీగా స్వాధీనం: ఒకరి అరెస్టు

చిత్తూరు సిటీ, అక్టోబరు 23: కర్ణాటకకు చెందిన మద్యం చిత్తూరులో భారీగా పట్టుబడింది. శుక్రవారం స్థానిక అర్బన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో సీఐ పురుషోత్తం మీడియాకు వివరాలు తెలిపారు. నగరంలోని సంతపేటలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమూర్తి (31), మణి(39) నివాసాల్లో తనిఖీ చేయగా.. కర్ణాటక మద్యం 180 ఎంఎల్‌ బాటిళ్లు 1,200 గుర్తించారు. దాంతో బాటిళ్లను స్వాధీనం చేసుకుని, గురుమూర్తిని అరెస్టు చేశారు. మరో నిందితుడు మణి పరారీలో ఉన్నాడని సీఐ చెప్పారు. మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దీనివెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు. 

Updated Date - 2020-10-24T11:56:39+05:30 IST