సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-26T08:22:37+05:30 IST

బెంగళూరు - చెన్నై, చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిలోని నంగమంగళం, గొల్లమడుగు, తమిళనాడు సరిహద్దుల్లో ఏ వాహనాలను రానివ్వకుండా ట్రైనీ డీఎస్పీ యశ్వంత్‌, వెస్ట్‌ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.

సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత

గుడిపాల, మార్చి 25: బెంగళూరు - చెన్నై, చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిలోని నంగమంగళం, గొల్లమడుగు, తమిళనాడు సరిహద్దుల్లో ఏ వాహనాలను రానివ్వకుండా ట్రైనీ డీఎస్పీ యశ్వంత్‌, వెస్ట్‌ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను వెనక్కి పంపారు. మండలంలో టూ వీలర్లను సైతం తిరగనివ్వకుండా పోలీసులు రౌండప్‌ చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐలు మునివేలు, ఎతిరాజులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-26T08:22:37+05:30 IST