చిత్తూరులో నివర్ తుపాన్ బీభత్సం

ABN , First Publish Date - 2020-11-26T17:20:06+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది.

చిత్తూరులో నివర్ తుపాన్ బీభత్సం

చిత్తూరు:  జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. ఏర్పేడు మండలం డిక్షన్‌ సమీపంలో మల్లిమడుగు వాగులో వరద పోటెత్తడంతో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పెనుగాలులు వీచడంతో యాదమరి మండలంలో ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చిత్తూరులోని గంగినేని చెరువుకు వరద ఉధృతి అధికంగా ఉంది. నీటిని వదిలేందుకు అధికారులు తూమును జేసీబీతో తవ్వుతున్నారు. అటు ఎన్టీఆర్ జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 

Updated Date - 2020-11-26T17:20:06+05:30 IST