బాగా పనిచేశారండీ!

ABN , First Publish Date - 2020-12-20T05:25:16+05:30 IST

చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు కొనియాడారు.

బాగా పనిచేశారండీ!
కలెక్టర్‌ను సత్కరిస్తున్న జిల్లా జడ్జి రవీంద్రబాబు

చిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 19: జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వి.రవీంద్రబాబు కలెక్టర్‌ భరత్‌గుప్తా ను కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ, లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠ అమలుపై జరిగిన సమావేశంలో ఆయన కలెక్టర్‌ను దుశ్శాలువతో సత్కరించారు. కాగా, ఐఎంఏ(న్యూఢిల్లీ) జాతీయ అధ్యక్షుడు రాజన్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఆర్వీ అశోకన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ను కొనియాడుతూ, ప్రశంసాపత్రాన్ని పంపారు. అనంతరం కలెక్టర్‌ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, జేసీ మార్కండేయులు, జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం, జేసీ(సంక్షేమం) రాజశేఖర్‌, ఆర్డీవోలు రేణుక, కనకనరసారెడ్డి తదితరులు అభినందించారు.

Updated Date - 2020-12-20T05:25:16+05:30 IST