చిత్తూరులో నేరాలు బాగా తగ్గాయి: ఎస్పీ
ABN , First Publish Date - 2020-12-30T18:37:09+05:30 IST
జిల్లాలో ఈ ఏడాది నేరాలు బాగా తగ్గిందని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. నేర నిర్మూలనలో 85 శాతం వృద్ధి రేటు ఉందన్నారు.
చిత్తూరు: జిల్లాలో ఈ ఏడాది నేరాలు బాగా తగ్గిందని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. నేర నిర్మూలనలో 85 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలు 11 శాతం, రోడ్డు ప్రమాదాలు 16 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 5.5 శాతం తగ్గిందని చెప్పారు. అలాగే చోరీల రికవరీ రేటు బాగా పెరిగిందని అన్నారు. ఎస్‌ఈబీ దాడులతో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. పీడీ యాక్టు ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.