చిత్తూరులో భారీ కొండ చిలువ హతం
ABN , First Publish Date - 2020-12-16T15:41:32+05:30 IST
జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలం గంగమ్మ గుడి సమీపంలో భారీ కొండ చిలువను ప్రజలు హతమార్చారు.
చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలం గంగమ్మ గుడి సమీపంలో భారీ కొండ చిలువను ప్రజలు హతమార్చారు. ఓ రైతు పొలంలో నుంచి చిత్తూరు - పుత్తూరు జాతీయ రహదారిపైకి కొండచిలువ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది కలిసి కొండచిలువను హతమార్చారు. ఈ కొండచిలువ ఎత్తు దాదాపు 15 అడుగులు ఉంటుందని అక్కడి స్థానికులు తెలిపారు.