చిత్తూరు: కళ్యాణి డ్యామ్‌లో పెరుగుతోన్న నీటి మట్టం

ABN , First Publish Date - 2020-12-07T12:57:02+05:30 IST

ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోంది.

చిత్తూరు: కళ్యాణి డ్యామ్‌లో పెరుగుతోన్న నీటి మట్టం

నేడు గేట్లు ఎత్తే అవకాశం?


చిత్తూరు: ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోంది. శేషాచలం అడవుల నుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో ఆదివారం సాయంత్రానికి 887 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. మరో అరడుగు నీరు చేరితే సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దాంతో కళ్యాణి వాగు, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. గేట్లు ఎత్తనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-07T12:57:02+05:30 IST