-
-
Home » Andhra Pradesh » Chittoor » chittoor
-
వాగులో కొట్టుకుపోయిన కారు...వైసీపీ నేత మృతి
ABN , First Publish Date - 2020-11-27T16:33:30+05:30 IST
జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

చిత్తూరు: జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఐరాల మండలంలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వైసీపీ నేత వినయ్ రెడ్డి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మరి కొద్దిసేపట్లో మృతదేహాన్ని చిత్తూరుకు తరలించనున్నారు.