హైదరాబాద్-రామేశ్వరం వేసవి ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2020-03-16T11:17:13+05:30 IST
హైదరాబాద్-రామేశ్వరం వేసవి ప్రత్యేక రైళ్లు
తిరుపతి (ఆటోనగర్), మార్చి 15: వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-రామేశ్వరం మధ్య రేణిగుంట మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో ప్రత్యేక రైలు (07685) జూన్ 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు క్యాంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, మైలాడుతురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగల్, కొడికనల్ రోడ్డు, మధురై, మానమదురై, పరమక్కుడి రైల్వేస్టేషన్ల మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. రామేశ్వరంలో ఈ ప్రత్యేక రైలు (07686) జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదు చేరుకుంటుంది.
ఫహైదరాబాద్-తిరుచిరాపల్లి మధ్య తిరుపతి మీదుగా ప్రత్యేక రైలు (07610) నడుస్తుందని ఇది జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో హైదరాబాద్‌లో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు క్యాంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, విరిధాచలం, అరియళ్లూరు, శ్రీరంగం రైల్వేస్టేషన్ల మీదుగా తిరుచిరాపల్లికి మరుసటి రోజుకు రాత్రి 7.15 గంటలకు చేరుకుంటుంది. తిరుచిరాపల్లెలోఈ ప్రత్యేక రైలు (07609) జూన్ 3, 10, 17, 24, జులై ఒకటి తేదీల్లో ఉదయం 6.05 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 3.40 గంటలకు హైదరాబాదుకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ ఉంటాయన్నారు.