నీటి సంపులో పడి ఆరేళ్ల బాలిక మృతి
ABN , First Publish Date - 2020-12-01T06:57:32+05:30 IST
తిరుమల బాలాజీనగర్లో సోమవా రం నీటి సంపులో పడి ఆరేళ్ల బాలిక మృతిచెం దింది.

తిరుమల బాలాజీనగర్లో విషాద ఘటన
తిరుమల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల బాలాజీనగర్లో సోమవా రం ఉదయం 11 గంట లకు నీటి సంపులో పడి ఆరేళ్ల బాలిక మృతిచెం దింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. బాలాజీనగర్ 6వ లైన్లో 689 నెంబరు ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో కలిసి భానుప్రకాష్, జయంతి దంపతులు ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె శశికళ(6) ఇంట్లో అడుకుంటూ ఉండగా తల్లిదండ్రులు బయట ఉన్నారు. కొంతసేపటి తర్వాత శశికళ ఇంట్లో కనిపించలేదు. అనుమానంతో భానుప్రకాష్ దంపతులు ఇంట్లోని నీటి సంపులో పరిశీలించగా శశికళ మునిగిపోయి కనిపించింది. ఆమెను బయటకు తీసి అశ్విని ఆస్పత్రిలోని అపోలో అస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.