దాణా లేక అల్లాడుతున్న కోళ్లు

ABN , First Publish Date - 2020-03-28T09:56:00+05:30 IST

ఐదు రోజులుగా కోళ్ల ఫారాలకు ఫీడ్‌ సరఫరా కాకపోవడంతో మేత లేక కోళ్లు అల్లాడుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా...

దాణా లేక అల్లాడుతున్న కోళ్లు

  • రెండురోజుల్లో ఫీడ్‌ అందక పోతే ప్రమాదంలో లక్షలాది కోళ్లు
  •  

చౌడేపల్లె/పలమనేరు, మార్చి 27: ఐదు రోజులుగా కోళ్ల ఫారాలకు ఫీడ్‌ సరఫరా కాకపోవడంతో మేత లేక కోళ్లు అల్లాడుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అమలవుతున్న లాక్‌ డౌన్‌ కారణంగా ఫీడ్‌కు అవసర మైన సోయా, మొక్కజొన్న జిల్లాకు చేరకపోవడంతో దాణాకు కొరత ఎదురైంది. ఉదాహరణకు చౌడేపల్లె మండలంలోని పరికిదొనకు చేందిన మనోహర్‌ తన ఫారంలో 10వేల కోళ్లు మేపుతున్నాడు. ఫీడ్‌ లారీలు తిరగకపోవడంతో అందుబాటులో ఉన్న నూకలు, బియ్యం, సద్దలు కోళ్లకు వేశాడు.


ఆ తరువాత ఏమి వేయాలో అర్థంకాక అల్లాడుతున్నాడు. మరో రెండు రోజులు ఫీడ్‌ అందకపోతే కోళ్లు చనిపోతాయని అవేదన వ్యక్తం చేశాడు.ఒక్క చౌడేపల్లె మండలంలోనే సుమారు వందకు పైగా కోళ్ల ఫారాల్లో 4 నుంచి 5 లక్షల కోళ్లు ఫీడ్‌ లేక అల్లాడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోళ్లరైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-28T09:56:00+05:30 IST