నోరూరించేలా.. చికెన్‌ మేళా

ABN , First Publish Date - 2020-03-19T11:07:46+05:30 IST

చైనా నుంచి మనదేశంలోని కరోనా వైరస్‌ దిగుమతి అయినప్పటి నుంచి పౌలీ్ట్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. చికెన్‌ తినరాదన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరందుకోవడమే ఇందుకు కారణం.

నోరూరించేలా.. చికెన్‌ మేళా

 చైనా నుంచి మనదేశంలోని కరోనా వైరస్‌ దిగుమతి అయినప్పటి నుంచి పౌలీ్ట్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. చికెన్‌ తినరాదన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరందుకోవడమే ఇందుకు కారణం. అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు గుడ్లు, చికెన్‌ హ్యాపీగా తినవచ్చని చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. దీంతో లైవ్‌ కోడి రూ.10కి, నాలుగు కిలోల కోడిమాంసం రూ.వందకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది.


ఈ నేపథ్యంలో చికెన్‌, గుడ్లు తింటే కరోనా రాదంటూ పుత్తూరులో స్థానిక వ్యాపారవేత్త విజయబాబు చికెన్‌ మేళా నిర్వహించారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని విజయబాబు రెసిడెన్సీలో పలురకాల నోరూరించే వంటకాలను సిద్ధం చేసి వడ్డించారు. చికెన్‌ విక్రయాలు తగ్గడంతో పౌలీ్ట్రని నమ్ముకున్న రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడి మాంసం తింటే కరోనా సోకదనీ, ఇదంతా ఒట్టి అపోహని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- పుత్తూరు


Updated Date - 2020-03-19T11:07:46+05:30 IST