-
-
Home » Andhra Pradesh » Chittoor » catches to kondachiluva
-
ఔరా.. కొండ చిలువనే పట్టేశారు..!
ABN , First Publish Date - 2020-12-29T05:10:30+05:30 IST
పాముగానిపల్లె పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలోని పొలాల్లో సోమవారం ఓ భారీ కొండచిలువ రైతుల కంట పడింది. కొంత మంది యువకులు ధైర్యంగా ఆ కొండ చిలువను చాకచక్యంగా పట్టేసి ఔరా అనిపించారు.

వి.కోట, డిసెంబరు 28: పాముగానిపల్లె పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలోని పొలాల్లో సోమవారం ఓ భారీ కొండచిలువ రైతుల కంట పడింది. కొంత మంది యువకులు ధైర్యంగా ఆ కొండ చిలువను చాకచక్యంగా పట్టేసి ఔరా అనిపించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు గ్రామానికి వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని తిరిగి అడవిలో వదిలిపెట్టారు. కాగా కొండచిలువతో సెల్ఫీలు దిగేందుకు గ్రామంలో పలువురు ఎగబడ్డారు.