విద్యుత్‌ అక్రమంగా వాడితే కేసులు

ABN , First Publish Date - 2020-03-04T09:16:20+05:30 IST

విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాలని విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు ఆదేశించారు.

విద్యుత్‌ అక్రమంగా వాడితే కేసులు

విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు


చిత్తూరు రూరల్‌, మార్చి 3: విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాలని విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు ఆదేశించారు. మంగళవారం చిత్తూరులోని విద్యుత్‌ శాఖ ఆపరేషన్‌, రూరల్‌ ఈఆర్వో కార్యాలయాల్లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీటర్లు పనిచేయకున్నా.. రీడింగ్‌లో తేడాలున్నా వెంటనే చర్యలు చేపట్టాన్నారు. పెండింగ్‌లోని విద్యుత్‌ బకాయిలు కలెక్షన్లపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్టీ, ఎస్సీలకు ఉచిత సర్వీసుల మంజూరులో ఆలస్యం చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ అమర్‌బాబు, డీఈలు మునిచంద్ర, శేషాద్రి, బబ్రూవాహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T09:16:20+05:30 IST