-
-
Home » Andhra Pradesh » Chittoor » cancell please go number 77
-
జీవో-77ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-27T06:28:41+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-77ను తక్షణం రద్దు చేయాలని టీడీపీ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

టీడీపీ, ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 26: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-77ను తక్షణం రద్దు చేయాలని టీడీపీ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ, ఎం-ఫార్మసీల్లో చేరే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు వర్తించవని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని నేతలు అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవకృష్ణ, ఎస్వీయూలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ప్రసంగించారు. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. ప్రతి పేద విద్యార్థికీ న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ అధికారాన్ని చేపట్టాక విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.