కలెక్టరేట్‌లో ‘కరోనా’ కాల్ సెంటర్
ABN , First Publish Date - 2020-03-08T13:42:36+05:30 IST
కరోనాపై సందేహాలు, ఫిర్యాదుల నమోదు కోసం శనివారం కలెక్టరేట్‌లో కరోనా కాల్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఇందుకోసం సెల్ నెంబరు 98499

- ఫోన్ నెంబర్ 98499 02379
చిత్తూరు కలెక్టరేట్: కరోనాపై సందేహాలు, ఫిర్యాదుల నమోదు కోసం శనివారం కలెక్టరేట్‌లో కరోనా కాల్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఇందుకోసం సెల్ నెంబరు 98499 02379 కేటాయించారు. తొలి రోజే 9 కాల్స్ నమోదయ్యాయి. ఇందుకోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌ను నియమించారు. కరోనా అనుమానిత కేసుల కలకలం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. వైరస్ నివారణలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పిస్తూ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ శుక్రవారం ఆదేశించడంతో కలెక్టరేట్‌లో డీఆర్వో చాంబర్ వద్ద ఈ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్య అధికారులు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను, ఆందోళనలు, సందేహాలను పుస్తకంలో నమోదు చేస్తూ కరోనా నివారణపై పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఫిర్యాదుదారుల చిరునామాలను కూడా పుస్తకంలో నమోదు చేస్తున్నారు.