-
-
Home » Andhra Pradesh » Chittoor » Btech student dead
-
బాహుదాలో పడి బీటెక్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2020-12-10T05:51:04+05:30 IST
బాహుదా ప్రాజెక్టులో పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకొంది.

నిమ్మనపల్లె, డిసెంబరు 9: బాహుదా ప్రాజెక్టులో పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథ నం మేరకు..కొండయ్యగారిపల్లెకు చెందిన కె.తరుణ్‌కుమార్‌రెడ్డి(20) తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం స్వగ్రామంలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వెతకగా బాహుదా ప్రాజక్టు వద్ద సెల్‌ఫోన్ దొరికింది. దీంతో బాహుదాలో వాల్మీకిపురం ఫైర్ సిబ్బంది గాలించగా, మృతదేహం లభ్యమైంది. ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు వర్ణనాతీతం. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా బాహుదా ప్రాజెక్టు నిండు కుండలా మారినా ఇరిగేషన్ అధికారులు ఏ రక్షణ చర్యలు చేపట్టలేదు. రాత్రిళ్లు నీటి ప్రవాహం ఎక్కువై పెద్ద ప్రమాదం జరగకనే అధికారులు స్పందించాల్సి ఉంది.