నీటికుంటలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-12-16T02:22:25+05:30 IST

నీటికుంటలో పడి పవన్‌కుమార్‌(2) అనే చిన్నారి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

నీటికుంటలో పడి చిన్నారి మృతి
కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి మణెమ్మ

శ్రీకాళహస్తి అర్బన్‌, డిసెంబరు 15: నీటికుంటలో పడి పవన్‌కుమార్‌(2) అనే చిన్నారి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వాగివేడుకు చెందిన వెంకటసుబ్బయ్య, మణెమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మంగళవారం ఇంటి బయట పవన్‌కుమార్‌ ఆడుకుంటూ నీటికుంటలో పడిపోయాడు. కొంతసేపటి తరువాత బాలుడి తల్లిదండ్రులు గుర్తించి కుంటలో నుంచి పైకి తీశారు. అప్పటికే మరణించినట్లు తెలుసుకుని రోదించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated Date - 2020-12-16T02:22:25+05:30 IST