-
-
Home » Andhra Pradesh » Chittoor » bodha chaithanya mahapari nirvanam
-
బోధ చైతన్య మహాపరినిర్వాణం
ABN , First Publish Date - 2020-12-29T05:23:48+05:30 IST
తెలుగు బౌధ్యతేజం, అగ్రశ్రేణి బౌద్ధ రచయిత, బుద్ధభూమి గౌరవ సంపాదకుడు బోధ చైతన్య(75) అనారోగ్యంతో మృతి చెందారు.

తిరుపతి (వైద్యం), డిసెంబరు 28: తెలుగు బౌధ్యతేజం, అగ్రశ్రేణి బౌద్ధ రచయిత, బుద్ధభూమి గౌరవ సంపాదకుడు బోధ చైతన్య(75) అనారోగ్యంతో మృతి చెందారు. నెల్లూరులోని ఓ ఆశ్రమంలో ఉంటున్న బోధ చైతన్య కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.వారం క్రితం వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో తిరుపతి స్విమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.26వ తేది అర్ధరాత్రి మహాపరినిర్వాణం చెందారు. దీంతో చైతన్య భౌతికకాయాన్ని తిరుపతి రూరల్ మండలం కూపు చంద్రపేట సమీపంలోని విశ్వధమ్మ పీఠంలో బౌద్ధమతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జరిగిన సంతాపసభలో బోధచైతన్య జ్ఞాపకార్థం తిరుపతిలోనే బుద్దిస్టు స్మృతి చిహ్నం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన సన్నిహితులైన ధమ్మమిత్ర గోవిందస్వామి ప్రకటించారు. తత్వశాస్ర్తాన్ని అధ్యయనం చేయడంలో ఎక్కువ కాలం గడిపిన ఆయన బౌద్ధమతంపై తెలుగులో దాదాపు 30కి పైగా పుస్తకాలను రచించి ఆంధ్రరాష్ట్రంలో మొదటి రచయితగా గుర్తింపు పొందారని చెప్పారు.ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న బోధచైతన్య జీవితం చాలా సాదాసీదాగా సాగిపోయిందని సంతాప సభలో పాల్గొన్న విశ్వధమ్మ పీఠం అధ్యక్షుడు సోంప్రకాష్ తెలిపారు. 1988-90నడుమ తిరుపతిలోని విశ్వధమ్మ పీఠంలో సంస్కృతి ఆచార్యులుగా పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేశారు.ధమ్మమిత్ర గోవింద స్వామి, బీఎస్పీ నాయకుడు కొల్లాంగుంట ప్రభాకర్, విశ్వధమ్మ పీఠం ఉత్తరాధికారి విశ్వ ప్రకాష్ తదితరులు పాల్గొని బోధ చైతన్యకు నివాళులర్పించారు.