ఇళ్ల పట్టాలపై వైసీపీ నేతలకు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్

ABN , First Publish Date - 2020-12-30T17:57:23+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీలో భూసేకరణలో వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

ఇళ్ల పట్టాలపై వైసీపీ నేతలకు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్

తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీలో భూసేకరణలో వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పవిత్రమైన శ్రీకాళహస్తిలోని బస్టాండ్ వద్ద జనవరి 5న 11 గంటలకు భూ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని సాక్ష్యాదారాలతో సహా తాము నిరూపిస్తామని స్పష్టం చేశారు. అవినీతి జరగలేదంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి ఆ రోజు నిరూపించాలని సవాల్ విసిరారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఓక్స్ వేగన్ కుంభకోణంపై బొత్స సత్యనారాయణపైన ఆరోపణలప్పుడు సి.బి.ఐ విచారణ కోరారన్నారు. అనంతపురంలో ఓ ఎమ్మెల్యయే హత్య వెనుక జగన్ హస్తంపై వచ్చిన ఆరోపణలపైన సీబీఐ విచారణ కోరారని తెలిపారు. సీబీఐ విచారణ తరువాత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని తెలిపారు. వైఎస్  జగన్ నిజంగా తండ్రి అడుగు జాడల్లో పాలన సాగిస్తుంటే... భూ పంపిణీలో కొనుగోలు చేసిన భూముల్లో వేల కోట్లు అవినీతి జరిగిందని.. దీనిపై సి.బి.ఐ విచారణకు జగన్ తక్షనం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రామాలయంపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని... దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. తక్షణం నిందితులను శిక్షించాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-30T17:57:23+05:30 IST