జనసైనికులకు క్రియాశీలక బీమా

ABN , First Publish Date - 2020-12-16T04:31:21+05:30 IST

జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ధీమాగా అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బీమా సభ్యత్వం చేపట్టారని డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ అన్నారు.

జనసైనికులకు క్రియాశీలక బీమా
ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న జనసేన నేత హరిప్రసాద్‌

తిరుపతి (తిలక్‌రోడ్డు), డిసెంబరు 15: జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ధీమాగా అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బీమా సభ్యత్వం చేపట్టారని డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవం నుంచి పనిచేస్తున్న క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు ఏడాదికి రూ.500 చెల్లించి క్రియాశీలక బీమ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. తిరుపతి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కిరణ్‌రాయల్‌ మాట్లాడుతూ.. జనసైనికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కింద వైద్యఖర్చులకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు పార్టీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రమాదంలో ముతిచెందితే నామినీకి రూ.5లక్షల సాయం అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 98662 39916, 98493 68686 94905 30056, 90000 55331 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి నగర జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, మునస్వామి, అమృత, సుమన్‌  తదితరులు పాల్గొన్నారు. 

Read more