కరోనా ఆంక్షల నడుమ నేడు బక్రీద్‌

ABN , First Publish Date - 2020-08-01T10:31:23+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బక్రీద్‌ పండుగను సాదాసీదాగా జరుపుకోవాలని అటు ప్రభుత్వం, ఇటు ముస్లిం షరియత్‌ కమిటీలు ..

కరోనా ఆంక్షల నడుమ నేడు బక్రీద్‌

పీలేరు, జూలై 31:కరోనా వ్యాప్తి నేపథ్యంలో బక్రీద్‌ పండుగను సాదాసీదాగా జరుపుకోవాలని అటు ప్రభుత్వం, ఇటు ముస్లిం షరియత్‌ కమిటీలు మార్గనిర్దేశకాలు జారీ చేశాయి.మూడు, నాలుగు రోజులుగా రెవెన్యూ, పోలీసు అధికారులు మసీదు, ఈద్గాహ్‌ కమిటీలు, ముస్లిం పెద్దలతో సమావేశాలు నిర్వహించి పండుగ నిర్వహణ విషయమై సూచనలు చేశారు. ఈద్గాహ్‌లలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ఉన్నందున ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో నే పండుగ నమాజు చేసుకోవాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి చేయరాదని, నిబంధనలు అతికమ్రిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.


Updated Date - 2020-08-01T10:31:23+05:30 IST