వలంటీర్లపై దాడి : ఇద్దరిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-05-13T10:42:12+05:30 IST

గ్రామంలో సారా అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లపై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు

వలంటీర్లపై దాడి : ఇద్దరిపై కేసు నమోదు

గుర్రంకొండ, మే 12: గ్రామంలో సారా అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లపై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు. గుర్రంకొండ మండలం నడిమికండిగ్ర పంచాయతీ గెరికుంటపల్లెకు చెందిన స్వామిశివ, బోజరాజు వాలంటీర్లుగా పని చేస్తున్నారు. మంగళవారం  వీరు గ్రామంలో  ఇంటింటికి వెళ్లి  సారా అమ్మకాల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై అదే ఊరికి చెందిన రెడ్డెప్ప, వెంకటరమణ వాలంటీర్లతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు.  వాలంటీర్ల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు.

Read more