అటవీ శాఖ అధికారులపై దాడి
ABN , First Publish Date - 2020-04-25T10:31:41+05:30 IST
ఇసుక అక్రమాలను ప్రశ్నించిన అటవీ అధికారులపై దుండగులు దాడికి దిగారు. శుక్రవారం తెల్లవారుజామున

రామకుప్పం, ఏప్రిల్ 24: ఇసుక అక్రమాలను ప్రశ్నించిన అటవీ అధికారులపై దుండగులు దాడికి దిగారు. శుక్రవారం తెల్లవారుజామున రామకుప్పం మండలం నారాయణపురంతాండా అటవీబీట్ మశానం వంక కుంటలో అదే తాండాకు చెందిన రాజేంద్రనాయక్, కుమార్‌నాయక్, మధునాయక్ ట్రాక్టరుకు ఇసుకను నింపుతుండగా ఉపక్షేత్రాధికారి పరమేశులు, బీట్‌అధికారి రాజశేఖర్ అడ్డుకున్నారు. రాజేంద్రనాయక్, కుమార్‌నాయక్ వారిపై దాడిచేసి పరారయ్యారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. దాడికి పాల్పడిన రాజేంద్రనాయక్ ప్రభుత్వ టీచరని ఉపక్షేత్రాధికారి పరమేశులు తెలియజేశారు.