భక్తుల కానుకలను తస్కరిస్తున్న నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-31T05:04:36+05:30 IST

భక్తులతో కలిసి మొక్కులు చెల్లిస్తున్నట్లు నటించాడు. వారు వేసే కానుకలను దొంగిలించబోయి దొరికపోయాడు

భక్తుల కానుకలను తస్కరిస్తున్న నిందితుడి అరెస్టు

తిరుపతి (వైద్యం), డిసెంబరు 30: భక్తులతో కలిసి మొక్కులు చెల్లిస్తున్నట్లు నటించాడు. వారు వేసే కానుకలను దొంగిలించబోయి దొరికపోయాడు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన ప్రకారం.. తెలంగాణకు చెందిన వినోద్‌ కుమార్‌(21) గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చాడు. రద్దీ ఎక్కువగా ఉండింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదాల వద్ద భక్తులు సమర్పిస్తున్న కానుకలపై (డబ్బులు) ఇతడి కళ్లు పడ్డాయి. భక్తుడిలా నటిస్తూ మొక్కుకుంటూ.. ఆ డబ్బులు దొంగలిస్తుండగా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఏసుబాబు పట్టుకుని విజిలెన్స్‌ అధికారులకు అప్పగించారు. అతడిని వారు విచారించి ఈస్ట్‌ పోలీసులకు అప్పగించగా, ఎస్‌ఐ నాగేంద్రబాబు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.

Updated Date - 2020-12-31T05:04:36+05:30 IST